మరుసటి రోజే రివర్స్!
ABN , Publish Date - Aug 12 , 2026 | 02:01 AM
దక్షిణాదిలోని పొగాకు వేలం కేంద్రాల్లో మళ్లీ నోబిడ్‌లు భారీగా పెరిగాయి. సగటు ధరతోపాటు రోజువారీ కొనుగోలు పరిమాణం కూడా తగ్గిపో యింది. ఇటీవల ఈ ప్రాంత పొగాకు మార్కెట్లోనే సోమవారం నోబిడ్‌లు తగ్గడంతోపాటు సగటు ధర, రోజువారీ కొనుగోలు పరిమాణం ఆశాజనకంగా కనిపించింది.
సగం కేంద్రాల్లో 30నుంచి 40శాతం నోబిడ్‌లు
తగ్గిన సగటు ధర, కొనుగోలు పరిమాణం
కనిష్ఠ ధర కి లోకు రూ.20 తగ్గింపు
ఎస్‌బీఎస్ రీజియన్‌లో మరింత దారుణం
ఒంగోలు, ఆగస్టు 11 (ఆంధ్ర జ్యోతి) : దక్షిణాదిలోని పొగాకు వేలం కేంద్రాల్లో మళ్లీ నోబిడ్‌లు భారీగా పెరిగాయి. సగటు ధరతోపాటు రోజువారీ కొనుగోలు పరిమాణం కూడా తగ్గిపో యింది. ఇటీవల ఈ ప్రాంత పొగాకు మార్కెట్లోనే సోమవారం నోబిడ్‌లు తగ్గడంతోపాటు సగటు ధర, రోజువారీ కొనుగోలు పరిమాణం ఆశాజనకంగా కనిపించింది. నోబిడ్‌లు కేవలం 18.55శాతానికే పరిమితమయ్యాయి. రోజువారీ కొనుగోలు పరిమాణం 0.78 మిలియన్ కిలోలు జరిగి సగటు ధర కూడా అంతకు ముందుకన్నా స్వల్పంగా పెరిగింది. అదేసమయంలో గుంటూరులోని బోర్డు కార్యాలయంలో వ్యాపారులు, బోర్డు అధికారులతో మంత్రులు ప్రత్యేక సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఒక రకంగా హెచ్చరికలు కూడా చేశారు. దీంతో ఇకనైనా ఉన్నంతలో మార్కెట్ గాడిన పడుతుందని, నోబిడ్‌లు తగ్గి ఏదో ఒక ధరకు అమ్ముకోగలమని రైతులు ఆశించారు. అయితే ఒక్కరోజులోనే మార్కెట్ మళ్లీ రివ ర్స్ అయింది. నోబిడ్‌లు సోమవారం కన్నా మంగళవారం దాదా పు 8శాతం పెరిగాయి. అలా మార్కెట్లో 26.85శాతం బేళ్లు నోబి డ్ అయ్యాయి. సగం వేలం కేంద్రాల్లో అవి 30నుంచి 40 శాతం వరకు ఉన్నాయి. ఎస్‌బీఎస్ రీజియన్‌లో పూర్తి ప్రతికూ లంగా మార్కెట్ సాగింది. దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాలకు మంగళవారం 7,578 బేళ్లను రైతులు అమ్మకానికి తీసుకొచ్చా రు. వాటిలో 4,998 బేళ్లను బయ్యర్లు కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 2,580 తిరస్కరించారు. వాటిలో 1,989 (26.85 శాతం) నోబిడ్ అయ్యాయి. అవి ఎస్‌బీఎస్ రీజియన్‌లో 27.68శాతం, ఎస్‌ఎల్‌ఎస్ రీజియన్‌లో 24.49 శాతం ఉన్నాయి. మంగళవారం మార్కెట్‌లో మొత్తం 0.64 మిలియన్ కిలోలు కొనుగోలు చేయగా సగటున కిలోకు రూ.182.88 ధర లభిం చింది. గరిష్ఠ ధర కిలో రూ.250 ఉండగా కనిష్ఠ ధరను గతం కన్నా కిలోకు రూ.20 తగ్గించి రూ.110 చేశారు. సోమవారం 0.78 మిలియన్ కిలోలు కొనుగోలు చేయగా సగటున కిలోకు రూ.185.24 ధర లభించింది. మంగళవారం కనిష్ఠ ధరను త గ్గించినా నోబిడ్‌లు పెరగడం, రోజువారీ కొనుగోలు పరిమా ణం, సగటు ధర తగ్గడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.