Share News

మద్యం మత్తులో రౌడీల ఘర్షణ

ABN , Publish Date - Apr 19 , 2026 | 02:36 AM

మద్యం మత్తులో రౌడీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అందుకు సంబంధించి కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న ఒక రౌడీషీటర్‌ పోలీసులు దుర్భాషలాడారని, అందుకే చనిపోతున్నానంటూ ర్యాట్‌ పాయిజన్‌ తాగుతూ వీడియో తీసి వైరల్‌ చేశాడు.

మద్యం మత్తులో రౌడీల ఘర్షణ

బీర్‌ బాటిల్‌తో దాడిచేయడంతో ఇరువురికి గాయాలు

కేసులు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు

పరారీలో ఉన్న రౌడీషీటర్‌ ఆత్మహత్యాయత్నం

ఒంగోలు క్రైం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : మద్యం మత్తులో రౌడీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అందుకు సంబంధించి కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న ఒక రౌడీషీటర్‌ పోలీసులు దుర్భాషలాడారని, అందుకే చనిపోతున్నానంటూ ర్యాట్‌ పాయిజన్‌ తాగుతూ వీడియో తీసి వైరల్‌ చేశాడు. వివరాలలోకి వెళితే.. ఈనెల 16న రౌడీషీటర్లు మోటా నవీన్‌, కొత్తా హరీష్‌తోపాటు రవిబాయ్‌, జాన్సన్‌లు ఒంగోలులోని వెంకటేశ్వరకాలనీ వద్ద మద్యం తాగారు. అక్కడ జాన్సన్‌ను మద్యంలోకి టచ్చింగ్‌ తీసుకురాలేదని హరీష్‌, నవీన్‌, రవిబాయ్‌లు కలిసి కొట్టారు. దీంతో జాన్సన్‌ బీరు బాటిల్‌ పగులకొట్టి ఎదురుదాడికి దిగాడు. ఈఘర్షణలో నవీన్‌, జాన్సన్‌లకు గాయాలయ్యాయి. ఇద్దరూ ఆసుపత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించి ఒంగోలు తాలూకా పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నిందితుల్లో రౌడీషీట్లు ఉన్న హరీష్‌, నవీన్‌ పరారు కాగా జాన్సన్‌, రవిబాయ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపఽథ్యంలో హరీష్‌ తల్లిని శుక్రవారం స్టేషన్‌కు పిలిచారు. అక్కడ ఆమెను తాలూకా సీఐ దుర్భాషాలాడారంటూ హరీష్‌ శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కూల్‌డ్రింక్‌లో ర్యాట్‌పాయిజన్‌ కలుపుకొని తాగాడు. ఆ సమయంలో సెల్ఫీ వీడియో తీశాడు. ఆ వీడియోలో తాలూకా సీఐ, పోలీసులు తనను చచ్పిపొమ్మన్నారు అని వ్యాఖ్యానించాడు. హరీష్‌ను చికిత్స నిమిత్తం ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

హరీష్‌పై రౌడీషీట్‌ ఉంది

రౌడీషీట్‌ ఉన్న కొత్త హరీష్‌పై కేసు నమోదు కావడంతో పోలీసు స్టేషన్‌కు రావాలని పిలిచామని తాలూకా సీఐ విజయ్‌కృష్ణ తెలిపారు. అతను పరారీలో ఉన్నాడని కుటుంబసభ్యులు చెప్పారన్నారు. హరీష్‌ తల్లి స్టేషన్‌కు రాగా మీ కుమారుడు మీద కేసు నమోదు అయినట్లు మాత్రమే తెలిపానని వివరించారు.

Updated Date - Apr 19 , 2026 | 02:36 AM