Share News

ప్రశాంతంగా ప్రారంభం

ABN , Publish Date - Feb 25 , 2026 | 02:33 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ప్రశాంతంగా జరిగాయి. నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని ముందే ప్రకటించటంతో అందరూ ఉదయం 9 గంటలలోపే ఆగమేఘాలమీద కేంద్రాలకు చేరుకున్నారు.

ప్రశాంతంగా ప్రారంభం
ఒంగోలులోని ఓ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు

67 కేంద్రాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు

18,719 మంది విద్యార్థులు హాజరు 8 674 మంది గైర్హాజరు

ఒంగోలు విద్య, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ప్రశాంతంగా జరిగాయి. నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని ముందే ప్రకటించటంతో అందరూ ఉదయం 9 గంటలలోపే ఆగమేఘాలమీద కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షకు మొత్తం 19,393 మంది హాజరుకావాల్సి ఉండగా 18,719 మంది విద్యార్థులు రాశారు. 674మంది గైర్హాజరయ్యారు. మొదటిరోజు తెలుగు/సంస్కృతం/హిందీ/ఉర్దూ పేపర్‌-2 పరీక్ష నిర్వహించారు. అధికారులు 43 కేంద్రాలను సందర్శించారు. ఆర్‌ఐవో ఆంజనేయులు ఆరు కేంద్రాలను పరిశీలించారు. స్క్వాడ్‌ అధికారులు 32, డీఈసీ సభ్యులు ఐదు కేంద్రాలను సందర్శించారు.

Updated Date - Feb 25 , 2026 | 02:33 AM