Share News

కాస్తంత ఊరట

ABN , Publish Date - Sep 20 , 2026 | 03:00 AM

వేసవిని తలపించే ఎండల తీవ్రత, ఆపై ఉక్కపోత వాతావరణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లా ప్రజానీకానికి కాస్తంత ఊరట లభించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలుప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది.

కాస్తంత ఊరట

జిల్లాలో ఓ మోస్తరు వాన

మొగిలిచర్లలో గరిష్ఠంగా 62.0 మి.మీ వర్షపాతం

ఒంగోలు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : వేసవిని తలపించే ఎండల తీవ్రత, ఆపై ఉక్కపోత వాతావరణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లా ప్రజానీకానికి కాస్తంత ఊరట లభించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలుప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. కొద్దిపాటి విస్తీర్ణంలో సాగైన ఖరీఫ్‌ పైర్లకు కొంత ఊపిరిపోసింది. శనివారం ఉదయం 9 గంటలకు 24 గంటల వ్యవధిలో జిల్లాలోనే అత్యధికంగా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో 62.0 మి.మీ వర్షపాతం నమోదైంది. అద్దంకిలో 44.70 మి.మీ, దర్శిలో 36.50, కొరిశపాడులో 28.50, ముండ్లమూరు మండలం మారెళ్లలో 24.0, సంతనూ తలపాడులో 20.19, కొత్తపట్నంలో 16.50, జె.పంగులూరులో 15.25, ఒంగోలులో 13.56, సంతమాగులూరులో 11.0, జరుగుమల్లిలో 10.50, కురిచేడులో 10.50, బల్లికురవలో 10.0 మి.మీ వర్షం కురిసింది.

Updated Date - Sep 20 , 2026 | 03:00 AM