Share News

వైద్యరంగానికి పెద్దపీట

ABN , Publish Date - Jul 12 , 2026 | 02:12 AM

వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, డిజిటల్‌ వైద్యంలో దేశంలోనే రాష్ట్రం ముందుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. గైనకాలజిస్ట్‌ డాక్టర్లఏపీసీవోజీ 11వ రాష్ట్ర సదస్సు రెండో రోజూ కొనసాగింది.స్థానికగుంటూరు రోడ్డులోని ఓ కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయ్‌కుమార్‌, డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు.

వైద్యరంగానికి పెద్దపీట
ఏపీసీవోజీ సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్‌, పీడీసీసీబీ చైర్మన్‌ శీతారామయ్య, గైనకాలజిస్టులు

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ స్వామి

ఒంగోలులో ఘనంగా గైనకాలజిస్ట్‌ల రాష్ట్ర సదస్సు

భారీగా హాజరైన మహిళా వైద్యులు

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, డిజిటల్‌ వైద్యంలో దేశంలోనే రాష్ట్రం ముందుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. గైనకాలజిస్ట్‌ డాక్టర్లఏపీసీవోజీ 11వ రాష్ట్ర సదస్సు రెండో రోజూ కొనసాగింది.స్థానికగుంటూరు రోడ్డులోని ఓ కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయ్‌కుమార్‌, డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ లేని నిరంతర విద్యార్థులు వైద్యులేనన్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునేది ఉపాధ్యాయులు, డాక్టర్లనేనన్నారు. బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో సంజీవని ప్రాజెక్టు ద్వారా వైద్యసేవ లను మరింత విస్తృతం చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్య లు తీసుకొంటున్నదని చెప్పారు. ప్రపంచ దేశాలలో వైద్యరంగంలో ప్రసూతి వైద్యులదే కీలక పాత్ర అన్నారు. నేటి సమాజానికి అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానం పెంపొందిం చుకోవడానికి, వైద్య రంగంలో నూతన విధానాలకు సదస్సులు ఎంతో దోహదపడతాయని మంత్రి అభిప్రా యపడ్డారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ మహిళా వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు ఒంగోలులో నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ప్రసూతి సేవలందిస్తున్న డాక్టర్లు ఆపరేషన్ల సంఖ్య తగ్గించి, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌. విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ డాక్టర్లు స్త్రీలు, చిన్నపిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సమాజంలో మహిళ డాక్టర్‌ పాత్ర ఎంతో కీలకమైనదని తెలిపారు. ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో ఒంగోలు టూరిజం, వైద్యరంగంలో రాష్ట్రంలోని ప్రధానభూమిక పోషించబోతుందన్నారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ప్రభుత్వం జిల్లాను హెల్త్‌ హబ్‌గా మార్చనుందని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి రాష్ట్ర సదస్సులకు ఒంగోలు వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. సదస్సు నిర్వహణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ హరి రోహిణికుమారి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మండవ కమల, కోశాధికారి డాక్టర్‌ గింజుపల్లి కల్పన కుమారి మాట్లాడుతూ గైనకాలజిస్టుల రాష్ట్ర సదస్సు ఒంగోలులో నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు. అందుకు ఏడాది నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ సదస్సులో 1,600 మంది మహిళా వైద్యులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం రికార్డుగా చెప్పుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి శీతారామయ్య, డీఎంహెచ్‌వో డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు, సీనియర్‌ డాక్టర్‌లు ఆలూరి ప్రభాకర్‌రావు, సుబ్బనాయుడుతోపాటు, మహిళా వైద్యులు నల్లూరి అరుణారావు, అనుమల శ్రీదేవి, మండువ కమల, నల్లూరి హిమబిందు, కల్పన, సాకే రాధ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అతిఽథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, అనంతరం ఏపీసీవోజీ సావనీర్‌ను ఆవిష్కరించారు. రాత్రి జరిగిన కార్యక్రమానికి పముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ హాజరై ప్రసంగించారు.

Updated Date - Jul 12 , 2026 | 02:12 AM