Share News

పొత్తిళ్లలో బిడ్డ.. ముళ్లపొదల్లో..!

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:40 PM

ఏ తల్లి కన్న బిడ్డో తెలియదు.. ఎందుకు అలా వదిలేశారో అర్థంకావడంలేదు.. తల్లి పొత్తిళ్లలో పడుకొని కేరింతలు కొడుతూ పాలు తాగాల్సిన శిశువు ముళ్ల పొదల్లో గాయాలుబారిన పడి గావుకేకలు పెడుతున్నాడు. రోజులు నిండని పసిబిడ్డ పొత్తి గుడ్డలలో చుట్టి ముళ్ల పొదల్లో వదిలివేసివెళ్లారు. ఈ సంఘటన ఒంగోలు నగరంలో వెలుగుచూసింది.

పొత్తిళ్లలో బిడ్డ.. ముళ్లపొదల్లో..!
రిమ్స్‌లో శిశువుకు వైద్యసేవలు అందిస్తున్న వైద్యులు పక్కన పోలీసు అధికారి

వాకింగ్‌కు వెళ్లిన వారు గుర్తించి పోలీసులకు అప్పగింత

ఒంగోలు వెలుగు చూసిన ఘటన

ఒంగోలు క్రైం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి) : ఏ తల్లి కన్న బిడ్డో తెలియదు.. ఎందుకు అలా వదిలేశారో అర్థంకావడంలేదు.. తల్లి పొత్తిళ్లలో పడుకొని కేరింతలు కొడుతూ పాలు తాగాల్సిన శిశువు ముళ్ల పొదల్లో గాయాలుబారిన పడి గావుకేకలు పెడుతున్నాడు. రోజులు నిండని పసిబిడ్డ పొత్తి గుడ్డలలో చుట్టి ముళ్ల పొదల్లో వదిలివేసివెళ్లారు. ఈ సంఘటన ఒంగోలు నగరంలో వెలుగుచూసింది. తెల్లవారగానే వాకింగ్‌కు వెళ్లిన వారికి గురువారం ఉదయం స్థానిక సమతానగర్‌ పోలేరమ్మ గుడి సమీపంలో ముళ్ల పొదల్లో చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే వాకింగ్‌ చేస్తున్న వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఒకవేళ వారు వచ్చే సరికి ఆలస్యమవుతుందన్న ఆవేదనలో.. పొత్తిగుడ్డల్లో ఉన్న శిశువును చేతుల్లోకి తీసుకొని ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు సీఐ విజయకృష్ణ వెంటనే మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి ఏ పద్మ సునందకి సమాచారమిచ్చి శిశువును వెంటనే రిమ్స్‌కు తరలించారు. అక్కడ చిన్నారికి వైద్యులు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. శిశువు రాత్రి నుంచి ఏడుస్తూ ఉండటం, అటుఇటు కదలడం వలన ముళ్ల పొదలు తగిలి శరీరం గాయాలు కావడంతో నీరసంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. శిశువుకు మెరుగైన సేవలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

Updated Date - Sep 10 , 2026 | 11:40 PM