Share News

పరిషత్‌ బరిలో 697 మంది

ABN , Publish Date - Oct 29 , 2026 | 02:48 AM

జిల్లా పరిషత్‌ ఎన్నికల బరిలో 601మంది అభ్య ర్థులు రంగంలో ఉన్నారు. మొత్తం 27 జడ్పీటీసీలు ఉండగా మర్రి పూడి, పొన్నలూరు స్థానాలు ఏక గ్రీవమయ్యాయి. మిగిలిన 25 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగు తున్నాయి.

పరిషత్‌ బరిలో 697 మంది
మర్రిపూడి జడ్పీటీసీగా ఏకగ్రీవమైన రాజుకు ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న జడ్పీ సీఈవో చిరంజీవి

జడ్పీటీసీలకు 96, ఎంపీటీసీలకు 601 మంది

రెండు జడ్పీటీసీలు, 151 ఎంపీటీసీలు ఏకగ్రీవం

పల్లెల్లో ప్రచారాన్ని ప్రారంభించిన అభ్యర్థులు

ఒంగోలు కలెక్టరేట్‌,అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ ఎన్నికల బరిలో 601మంది అభ్య ర్థులు రంగంలో ఉన్నారు. మొత్తం 27 జడ్పీటీసీలు ఉండగా మర్రి పూడి, పొన్నలూరు స్థానాలు ఏక గ్రీవమయ్యాయి. మిగిలిన 25 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగు తున్నాయి. 96 మంది రంగంలో ఉన్నారు. జిల్లాలో 371 ఎంపీటీసీలకు ఎన్నికలు ప్రకటించగా 151 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 220 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 601 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా పార్టీల తరఫున పోటీలో ఉండే అభ్యర్థులు తేలడంతో వారంతా ప్రచారాన్ని ప్రారంభించారు. జడ్పీటీసీలకు సంబంధించి టీడీపీ నుంచి 23మంది, జనసేన నుంచి ఇద్దరు వైసీపీ తరఫున 25 మంది రంగంలో ఉన్నారు. వీరితోపాటు బీఎస్పీ నుంచి ఐదుగురు, ఆప్‌ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఒకరు, కాంగ్రెస్‌ నుంచి ఐదుగురు, స్వతంత్రులు 31 మంది, సీపీఐ, బీసీవై నుంచి ఒక్కొక్కరు పోటీలో నిలిచారు. ఎంపీటీసీలకు 601 మంది రంగంలో ఉండగా టీడీపీ నుంచి 209 మంది, జనసేన నుంచి 27 మంది, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. వైసీపీ నుంచి 211 మంది, కాంగ్రెస్‌ నుంచి ఐదుగురు, సీపీఐ నుంచి 7, సీపీఎం నుంచి 6, బీఎస్పీ నుంచి 3, బీసీవై నుంచి ఒకరు, స్వతంత్రులు 131 మంది రంగంలో నిలిచారు. దీంతో ఆయా స్థానాల్లో పోటీచేసిన వారికి గుర్తులు కేటాయించడంతో బుధవారం ఉదయం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. కూటమి అభ్యర్థులు ముందుగానే ఖరారవడంతో వారు ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఒక విడత పూర్తిచేశారు. తదుపరి ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు.

Updated Date - Oct 29 , 2026 | 02:48 AM