514 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Apr 14 , 2026 | 02:42 AM
జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో ఏడు క్లస్టర్లలో కొనుగోలు కేంద్రాల ద్వారా 514 మెట్రిక్ టన్నుల ధాన్యంను సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల సంస్థ, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో ఏడు క్లస్టర్లలో కొనుగోలు కేంద్రాల ద్వారా 514 మెట్రిక్ టన్నుల ధాన్యంను సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల సంస్థ, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రబీ సీజన్‌లో 81,421 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేయగా 2,01,251 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. జిల్లాలోని 41 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యంను రైస్ మిల్లులకు రవాణా చేస్తామన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అధికారులు పలు అంశాలను జేసీ దృష్టికి తెచ్చారు. జిల్లాలో రైతులు అధిక మొత్తంలో సన్నరకాల వంగడాలు సాగు చేశారని, అందులో ఎక్కువభాగం బహిరంగ మార్కెట్లో చెప్పారు. దీనిపై జేసీ మాట్లాడుతూ మండల, గ్రామ వ్యవసాయ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది, రైతులతో సమావేశం ఏర్పాటు కొనుగోలు ప్రక్రియ, మద్దతు ధర, నాణ్యత ప్రమాణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అధికారులు వరలక్ష్మి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.