Share News

50మంది కార్యదర్శులకు ఉద్యోగోన్నతులు

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:50 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న 50 మంది గ్రేడ్‌-6 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్‌-5గా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కలెక్టర్‌ రాజాబాబు ఉత్తర్వులు జారీచేశారు.

50మంది కార్యదర్శులకు ఉద్యోగోన్నతులు
ఉద్యోగోన్నతి పత్రాన్ని అందజేస్తున్న డీపీవో వెంకటేశ్వరరావు

పత్రాలు అందజేసిన డీపీవో వెంకటేశ్వరరావు

ఒంగోలు కలెక్టరేట్‌, పిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న 50 మంది గ్రేడ్‌-6 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్‌-5గా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కలెక్టర్‌ రాజాబాబు ఉత్తర్వులు జారీచేశారు. గ్రేడ్‌-6లో 55మందికి ఉద్యోగో న్నతి పొందేందుకు అర్హత ఉండగా వారిలో ఒకరు రాజీనామా చేశారు. మరో నలుగురు వివిధ కారణాలతో ఉద్యోగోన్నతులు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో 50మందికి మాత్రమే ఉద్యోగోన్నతి కల్పించారు. వారికి డీపీవో వెంకటేశ్వరరావు శుక్రవారం ఉత్తర్వులను అందజేశారు.

Updated Date - Feb 28 , 2026 | 01:50 AM