ఇంటర్ అడ్మిషన్‌లలో 4వ స్థానం
ABN , Publish Date - Jul 09 , 2026 | 02:38 AM
ఇంటర్మీడి యెట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లలో ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో నాల్గో స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌లో ఈ ఏడాది 5,31,171 మందికి 4,47,242 మందిని చేర్చారు.
ఉమ్మడి జిల్లాలో భారీగా విద్యార్థుల ప్రవేశాలు
ఒంగోలు విద్య, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్మీడి యెట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లలో ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో నాల్గో స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌లో ఈ ఏడాది 5,31,171 మందికి 4,47,242 మందిని చేర్చారు. జిల్లాలో గత ఏడాది 22,273 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరగా ఈ ఏడాది ఇప్పటివరకు 20,266 మంది ప్రవేశాలు పొందారు. ఇంకా 2,007 మంది చేరాల్సి ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రాష్ట్రంలో78,468 మందికి 56,379 మంది అడ్మిషన్లు సాధించి 71.85శాతం లక్ష్యాన్ని సాధించారు. జిల్లాలో గత ఏడాది అడ్మిషన్ల కంటే 10శాతం పెంచి 2,765మంది విద్యార్థులను చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు 2,160 మంది ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరంలో చేరినట్లు ఆర్‌ఐవో కె.ఆంజనేయులు తెలిపారు. లక్ష్యసాధనకు ఇంకా 606 మందిని చేర్చాల్సి ఉందన్నారు. అడ్మిషన్ల గడువు ముగిసే లోపు లక్ష్యాన్ని పూర్తిచేస్తామని ఆయన చెప్పారు.