Share News

పింఛన్‌ కోసం 46,340 దరఖాస్తులు

ABN , Publish Date - Sep 17 , 2026 | 02:47 AM

పింఛన్‌ కోసం వస్తున్న దరఖాస్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 18వతేదీ వరకూ పొడిగించింది. జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పథకం ద్వారా వివిధ కేటగిరీల కింద ఇప్పటికే 2,16,950 మందికి ప్రభుత్వం పింఛన్లను అందజేస్తోంది.

పింఛన్‌ కోసం 46,340 దరఖాస్తులు

రోజురోజుకూ పెరుగుతున్న వైనం

రేపటి వరకు గడువు పొడిగించిన ప్రభుత్వం

ఒంగోలు నగరం, సెప్టెంబరు 16 (ఆంధ్ర జ్యోతి) : పింఛన్‌ కోసం వస్తున్న దరఖాస్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 18వతేదీ వరకూ పొడిగించింది. జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పథకం ద్వారా వివిధ కేటగిరీల కింద ఇప్పటికే 2,16,950 మందికి ప్రభుత్వం పింఛన్లను అందజేస్తోంది. కొత్త పింఛన్ల మంజూరుకు ఈనెల 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. తొలుత ఈనెల 16 వరకూ గడువు విధించింది. ఇప్పుడు రెండు రోజులు పొడిగిం చింది. జిల్లాలో కొత్త పింఛన్‌ల కోసం 30 వేల దరఖాస్తులు అందుతాయని అంచనా వేశారు. అయితే ఇప్పటికే 46,340 వచ్చాయి. 18వ తేదీ వరకూ అవకాశం ఇవ్వడంతో 50వేలకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల్లో అత్యధికంగా వృద్ధాప్య పింఛన్ల కోసం 23,748, వితంతు పింఛన్‌ల కోసం 10,061, దివ్యాంగ పింఛన్‌ల కోసం 4,461 ఉన్నాయి. వీటితోపాటు చర్మకారులు, డప్పుకళాకారుల కేటగిరీ కింద కూడా వేలల్లోనే దరఖాస్తులు అందుతున్నాయి.

Updated Date - Sep 17 , 2026 | 02:47 AM