Share News

దక్షిణాదిలో 42.17శాతం వెనక్కి

ABN , Publish Date - May 05 , 2026 | 02:08 AM

దక్షిణాది పొగాకు మార్కెట్‌లో బేళ్ల తిరస్కరణలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వారం నుంచి వీటిశాతం అధికంగా ఉంటోంది. సోమవారం ఏకంగా 42.17శాతం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

దక్షిణాదిలో 42.17శాతం వెనక్కి

వెల్లంపల్లిలో అత్యధికంగా 60శాతం.. పలుచోట్ల 35శాతంపైనే!

తిరస్కరణకు గురైన పొగాకు బేళ్లలో మూడొంతులకుపైగా నోబిడ్‌వే

ఒంగోలు, మే 4 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది పొగాకు మార్కెట్‌లో బేళ్ల తిరస్కరణలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వారం నుంచి వీటిశాతం అధికంగా ఉంటోంది. సోమవారం ఏకంగా 42.17శాతం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో ఉన్న 11 వేలం కేంద్రాలలో సోమవారం అత్యధికంగా వెల్లంపల్లిలో 60శాతం బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. మూడు జిల్లాల పరిధిలో ఉన్న 11 కేంద్రాలకు సోమవారం మొత్తం 4,177 బేళ్లు వేలానికి తీసుకురాగా 3,414 బేళ్లను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. 42.17 శాతం బేళ్లను తిరస్కరించారు. వాటిలో మూడొంతులు పైగా నోబిడ్‌లు ఉంటున్నాయి. అంటే ఆ బేళ్లకు పొగాకు బోర్డు అధికారులు బిడ్డింగ్‌ పెట్టిన ధరకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందు కు రాక నోబిడ్‌ అవుతున్నాయి. ఆయా వేలం కేంద్రాల వారీ పరిశీలిస్తే.. వెల్లంపల్లిలో సోమ వారం మార్కెట్‌లో కొనుగోళ్లు దారుణంగా ఉన్నాయి. అక్కడికి 393 బేళ్లను అమ్మకానికి తీసుకురాగా కేవలం 236 బేళ్లను మాత్రమే కొనుగోలు చేశారు. 215 తిరస్కరణకు గురయ్యాయి. అవి అమ్మకానికి తెచ్చిన బేళ్లలో 60శాతం. అలా తిరస్కరణకు గురైన 215 బేళ్లలో 103 అధికారులు పెట్టిన ధరకు ఎవరూ కొనక నోబిడ్‌ అయ్యాయి. నోబిడ్‌ శాతం 54.71గా ఉంది. టంగుటూరు కేంద్రంలో తిర స్కరణ బేళ్లు 42శాతంగా ఉన్నాయి. పొదిలిలో 54 శాతం, కనిగిరిలో 50.18 శాతం జరిగాయి. పలు ఇతర కేంద్రాలలోనూ 35శాతం పైగానే బేళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. ఈ పరిస్థితిపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - May 05 , 2026 | 02:08 AM