ముగిసిన 38వ టెన్నికాయిట్ అంతర్ జిల్లాల పోటీలు
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:22 PM
ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల సబ్ జూనియర్స్ బాలుర, బాలికల టెన్నికాయిట్ చాంపియన్ షిప్ 2026-27 పోటీలు ఆదివారం ఘనంగా జరుగుమల్లిలోని జడ్పీహెచ్‌ఎ్‌సలో ముగిశాయి.
జరుగుమల్లి (కొండపి), జూలై 12 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల సబ్ జూనియర్స్ బాలుర, బాలికల టెన్నికాయిట్ చాంపియన్ షిప్ 2026-27 పోటీలు ఆదివారం ఘనంగా జరుగుమల్లిలోని జడ్పీహెచ్‌ఎ్‌సలో ముగిశాయి. ముగింపు వేడుకలకు రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఎన్నికైన క్రీడాకారులు అక్టోబరు 17నుంచి 21వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని టోర్నమెంట్ ఆర్గనైజర్ ఎన్.టి.ప్రసాద్, ఏపీ టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎ.ఎన్.వి. సత్యనారాయణ తెలిపారు.
నేషనల్స్‌కు ఎంపికైన క్రీడాకారులు.. సబ్ జూనియర్స్ బాలుర విభాగంలో జె. సంపత్(అనకాపల్లి), పి.సందీప్ (కాకినాడ), కె.గౌతం(శ్రీకాకుళం), పీబీవీ సాయికిరణ్ (కాకినాడ), బి.ఆకా్‌షబాబు(తూర్పుగోదావరి), కౌశిక్‌బాబు (ప్రకాశం), హరికృష్ణ(విజయనగరం),గోపీచంద్ (ప్రకాశం)
సబ్ జూనియర్స్ బాలికల విభాగంలో ఎం. ప్రియదర్శిని (తూర్పుగోదావరి), ఎన్. దివ్య (శ్రీకాకుళం), జి. కీర్తి (చిత్తూరు), ఎం. దివ్యచరిత (విజయనగరం), జె. లాస్య (తూర్పుగోదావరి), పి. ద్రాక్షాయణి (చిత్తూరు), ఆర్. సుష్మ (అల్లూరి జిల్లా), పి. భవ్య (అనంతపురం) ఎంపికయ్యారు.