Share News

ఇంటర్‌లో 38 మంది షైనింగ్‌ స్టార్లు

ABN , Publish Date - Jul 18 , 2026 | 01:48 AM

ఇంటర్మీ డియెట్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను షైనింగ్‌ స్టార్లుగా గుర్తించారు. జిల్లాస్థాయి షైనింగ్‌ స్టార్‌ అవార్డులకు ఇంటర్మీడియెట్‌ బోర్డు 38 మందిని ఎంపిక చేసింది.

ఇంటర్‌లో 38 మంది షైనింగ్‌ స్టార్లు

20న జిల్లాస్థాయిలో అవార్డుల ప్రదానం

ఒంగోలు విద్య, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్మీ డియెట్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను షైనింగ్‌ స్టార్లుగా గుర్తించారు. జిల్లాస్థాయి షైనింగ్‌ స్టార్‌ అవార్డులకు ఇంటర్మీడియెట్‌ బోర్డు 38 మందిని ఎంపిక చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ విద్య డైరెక్టర్‌ రంజిత్‌బాష ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాలల యాజమాన్యంతో సంబంధం లేకుండా పరీక్షల్లో ప్రతిభ చూపి అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల విద్యార్థులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. వీరికి ఈనెల 20న ఒంగోలులో జరిగే కార్యక్రమంలో మెరిట్‌ సర్టిఫికెట్‌, మెడల్‌, రూ.20వేల నగదును చెక్కు రూపంలో అంద జేస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ, ఒకేషనల్‌ కోర్సుల్లో ప్రతిభ చూపి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఇందుకు ఎంపిక చేశారు.

Updated Date - Jul 18 , 2026 | 01:48 AM