Share News

3 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:25 PM

చెడు వ్యసనాలకు బానిసలై అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు గంజాయి విక్రయానికి సిద్ధపడ్డారు. దానిని అమ్ముతూ పట్టుబడి కటకటాల పాలయ్యారు.

3 కిలోల గంజాయి స్వాధీనం
మాట్లాడుతున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు

ముగ్గురు నిందితుల అరెస్టు

వివరాలను వెల్లడించిన మార్కాపురం డిఎస్పీ నాగరాజు

గిద్దలూరు టౌన్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : చెడు వ్యసనాలకు బానిసలై అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు గంజాయి విక్రయానికి సిద్ధపడ్డారు. దానిని అమ్ముతూ పట్టుబడి కటకటాల పాలయ్యారు. గిద్దలూరు పోలీసుస్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ గిద్దలూరు మండలం క్రిష్ణంశెట్టిపల్లెకు చెందిన ఆలమూరి చంద్రయ్య, దిగపాటి వెంకటేష్‌, వెంగలరెడ్డిపల్లెకు చెందిన బిజ్జం వెంకటశ్రీరామ్‌రెడ్డిలు చెడు వ్యసనాలకు బానిసై గంజాయిని విక్రయిస్తున్నారు. చంద్రయ్య గంజాయిని విజయనగరం వైపు నుంచి రైలులో తీసుకొచ్చి వెంకటేష్‌, శ్రీరామ్‌రెడ్డిలకు అమ్మేవాడు. అలాగే ముగ్గురూ కలిసి గిద్దలూరు పట్టణం, పక్క గ్రామాలలో 10 గ్రాముల గంజాయిని ప్యాకెట్లలో 500 రూపాయలకు అమ్ముతున్నారు. మంగళవారం ముగ్గురు కలిసి కెఎ్‌సపల్లె నుంచి ఉప్పలపాడు గ్రామం మధ్య సగిలేరు బ్రిడ్జి వద్ద ఉండగా పోలీసులు అనుమానం వచ్చి తనిఖీ చేశారు. అర్బన్‌ సీఐ కె.సురేష్‌, ఎస్సై ఇమ్మానియేలు నిందితుల వద్ద 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.30వేలు ఉంటుందని, నిందితులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. గంజాయి పట్టుకున్నందుకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు సీఐ సురే్‌షను అభినందించారు. సీఐ సురేష్‌, ఎస్సై ఇమ్మానియేలు ఉన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 11:25 PM