డీఎస్సీలో 291 పోస్టులు
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:22 AM
డీఎస్సీ-26లో ఉమ్మడి జిల్లాకు 291 పోస్టులు ప్రకటించారు. అందుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. మొత్తం పోస్టుల్లో ఆరు బ్యాక్‌లాగ్ కూడా ఉన్నాయి. 291లో ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 277, మున్సిపాలిటీల్లో మూడు, ఒంగోలు కార్పొరేషన్‌లో 11 పోస్టులు ప్రకటించారు.
రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు ఖరారు
ఒంగోలు విద్య, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : డీఎస్సీ-26లో ఉమ్మడి జిల్లాకు 291 పోస్టులు ప్రకటించారు. అందుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. మొత్తం పోస్టుల్లో ఆరు బ్యాక్‌లాగ్ కూడా ఉన్నాయి. 291లో ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 277, మున్సిపాలిటీల్లో మూడు, ఒంగోలు కార్పొరేషన్‌లో 11 పోస్టులు ప్రకటించారు. మొత్తం పోస్టుల్లో స్కూలు అసిస్టెంట్ తెలుగు 4, హిందీ 10, ఇంగ్లీషు 17, ఉర్దూ ఒకటి, గణితం 3, ఫిజికల్ సైన్స్ 4, బయోలాజికల్ సైన్స్ 17, సోషల్ 23, ఫిజికల్ ఎడ్యుకేషన్ 16, స్పెషల్ ఎడ్యుకేషన్ 11, సెకండరీ గ్రేడ్ టీచర్(తెలుగు) 170, ఎస్‌జీటీ ఉర్దూ 1, ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ 14 ఉన్నాయి. వీటిలో స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూలు అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు 25 పోస్టులు కొత్త గా మంజూరు చేసి ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ డీఎస్సీకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు, కొండపి, కందుకూరు, అద్దంకి, దర్శి, ప్రస్తుతం మార్కాపురం జిల్లాలోని కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం నియోజకవర్గాల పరిధిని లోకల్‌గా పరిగణిస్తారు. డీఎస్సీలో 95 శాతం పోస్టులను లోకల్ అభ్యర్థులకు కేటాయించారు. కాగా ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆ రిజర్వేషన్ల ప్రకారం పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.