పింఛన్ కోసం 254 మంది దరఖాస్తు
ABN , Publish Date - Sep 08 , 2026 | 02:47 AM
కొత్త పింఛన్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. స్వర్ణ వార్డు, గ్రామ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరించారు. తొలిరోజు జిల్లావ్యాప్తంగా 254 మంది అందజేశారు.
16 వరకు కొనసాగనున్న ప్రక్రియ
ఒంగోలు నగరం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : కొత్త పింఛన్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. స్వర్ణ వార్డు, గ్రామ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరించారు. తొలిరోజు జిల్లావ్యాప్తంగా 254 మంది అందజేశారు. వీరిలో వృద్ధాప్య పింఛన్ కోసం అధికంగా 158 మంది ఉన్నారు. వితంతు పింఛన్‌లు కోరుతూ 67, దివ్యాంగ పింఛన్ల కోసం 28 మంది, మత్స్యకార పింఛన్ కోసం ఒకరు దరఖాస్తు చేసుకున్నారు. తొలిరోజు వందల సంఖ్యలో స్వర్ణ గ్రామ కార్యాలయాలకు వచ్చినప్పటికీ అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో అనేకమంది వెను దిరిగారు. ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.