వైసీపీ నుంచి 25 కుటుంబాలు టీడీపీలోకి
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:17 PM
తమ్మవరంలో వైసీపీకి చెందిన 25 కుటుంబాలు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి.
పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి రవికుమార్
మేదరమెట్ల, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి) : మండలంలోని తమ్మవరంలో వైసీపీకి చెందిన 25 కుటుంబాలు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని మంత్రి రవికుమార్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నాయకులు రామిరెడ్డి ఆంజనేయులు(ఎంకాం), కరిచేటి రాంబాబు, రామిరెడ్డి వీరాంజనేయులులతో కలిసి వచ్చిన వైసీపీ నాయకులకు మంత్రి రవికుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీలో చేరిన వారిలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు పాణ్యం శ్రీనివాసరావు, మాజీ ఉప సర్పంచ్ యద్దనపూడి చింపిరయ్య, వెంకట్రావు, కోణికి శ్రీనివాసరావు, అనిల్, వెంకటేశ్వరరావు, వల్లా నాగరాజు, మల్లికార్జున, ఏడుకొండలు, పాణ్యం కోటేశ్వరరావు, రామాంజనేయులు, అశోక్, పొల్లా వెంకటనారాయణ, బట్టు గురుస్వామి, బాలం వెంకటేశ్వరరావు, ఏడుకొండలు, బ్రహ్మం తదితరులు ఉన్నారు.