Share News

మార్కాపురం జిల్లాలోని మున్సిపల్‌ బరిలో 238 మంది

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:34 AM

జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి పురపాలక సంఘాల్లో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మిగిలిని తుది జాబితాను ఆదివారం అధికారులు ప్రకటించారు. మొత్తం 238 మంది బరిలో నిలిచారు.

మార్కాపురం జిల్లాలోని మున్సిపల్‌ బరిలో 238 మంది

కనిగిరి టీడీపీకి ఏకగ్రీవం

మార్కాపురంలో కూటమికి 3 వార్డులు..అధికారికంగా వెల్లడి

మార్కాపురం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి పురపాలక సంఘాల్లో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మిగిలిని తుది జాబితాను ఆదివారం అధికారులు ప్రకటించారు. మొత్తం 238 మంది బరిలో నిలిచారు. మార్కాపురంలో చైర్మన్‌ పదవి కోసం 12 మంది రంగంలో ఉన్నారు. వారిలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. 40 వార్డులకు వచ్చిన 306 నామినేషన్లలో ఉపసంహరణ తరువాత 37 వార్డుల్లో 125 మంది పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. 19, 30, 31 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో అవి ఏకగ్రీవమైనట్లు తెలిపారు. అందులో రెండు వార్డులు టీడీపీ, ఒకటి బీజేపీకి దక్కాయి. గిద్దలూరు మున్సిపాలిటీలో చైర్మన్‌ పదవి కోసం వేసిన నామినేషన్లలో ఐదుగురు పోటీలో మిగిలారు. మొత్తం 28 వార్డులకు గాను 86 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

కనిగిరిలో టీడీపీ...

కనిగిరిలో చైర్‌పర్సన్‌ పదవి టీడీపీకి ఏకగ్రీవమైంది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా అచ్చాల తిరుపతమ్మ నామినేషన్‌ మాత్రమే మిగిలి ఉండడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. అలాగే 32వార్డుల్లో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 30 వార్డుల్లో కూటమి అభ్యర్థుల నామినేషన్లే మిగిలి ఉండడంతో అవన్నీ ఏకగ్రీవమైనట్లు సహాయ ఎన్నికల అధికారి శ్రీధర్‌ తెలిపారు. మిగిలిన 6, 29 వా ర్డుల్లో ఎన్నికలు జరగనున్నాయని ఆయన చెప్పారు. వీటిలో బీజేపీ 2, జనసేన ఒకటి, మిగిలిన 27 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

Updated Date - Oct 26 , 2026 | 12:34 AM