Share News

పింఛన్‌ కోసం 21,766 దరఖాస్తులు

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:03 AM

ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్తగా పింఛన్‌లు కోరుతూ ఐదు రోజుల్లో 21,766 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 7వతేదీ నుంచి దరఖాస్తుల దాఖలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

పింఛన్‌ కోసం 21,766 దరఖాస్తులు
ఒంగోలులోని కొప్పోలు రోడ్డులో ఉన్న స్వర్ణ వార్డులో రాత్రి సమయంలో దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేస్తున్న సిబ్బంది

16తో దరఖాస్తుకు ముగియనున్న గడువు

ఒంగోలు నగరం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్తగా పింఛన్‌లు కోరుతూ ఐదు రోజుల్లో 21,766 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 7వతేదీ నుంచి దరఖాస్తుల దాఖలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 16వతేదీ వరకు గడువు ఇచ్చింది. వచ్చి న దరఖాస్తులను స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెం ట్లు ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపిస్తు న్నారు. ఇప్పటి వరకూ అందిన వాటిలో అత్యధికం వృద్ధాప్య పింఛన్‌ కోరు తూ 12,714 ఉన్నాయి. వితంతు పింఛన్‌ కోసం 5,442 మంది, దివ్యాంగ పింఛన్‌ కోసం 2,541 మంది దరఖాస్తు చేసుకున్నారు. చర్మకారుల కేటగిరీ కింద 421, డప్పు కళాకారులు 315, మత్స్యకారులు 195, చేనేత కార్మికు లు 61, ఒంటరి మహిళలు 43, కల్లుగీత కార్మికులు 27, హిజ్రాలు ఏడుగురు దరఖాస్తు అందజేశారు. గడువు ముగిసేసరికి ప్రభుత్వ అంచ నాలకు మించి దరఖాస్తులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

-------------------------------------

Updated Date - Sep 12 , 2026 | 03:03 AM