బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:58 AM
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు పొల్లూరి ఏబుకు 20 ఏళ్ల జైలు, రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలులోని పోక్సో కోర్టు న్యాయాధికారి కె.శైలజ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కఽథనం మేరకు.. గుడ్లూరు మండలం పాజర్లకు చెందిన పొల్లూరి ఏబు 2020 జూన్ 1న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఒంగోలు పోక్సో కోర్టు న్యాయాధికారి తీర్పు
ఒంగోలు క్రైం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు పొల్లూరి ఏబుకు 20 ఏళ్ల జైలు, రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలులోని పోక్సో కోర్టు న్యాయాధికారి కె.శైలజ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కఽథనం మేరకు.. గుడ్లూరు మండలం పాజర్లకు చెందిన పొల్లూరి ఏబు 2020 జూన్ 1న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. బాధితురాలి తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. కేసు విచారణ సమయంలో బలమైన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టు ముందు ఉంచారు. విచారించిన న్యాయాధికారి శైలజ.. నిందితుడు ఏబుపై నేరం రుజువు కావడంతో నేరస్థునిగా పరిగణించి 20ఏళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధించారు. బాధితు రాలికి రూ.2లక్షల పరిహారం అందజేయాలని డీఎల్‌ఎస్‌ఏకి ఆదేశాలు ఇచ్చారు. అప్పటిలో కేసును సమర్థవంతంగా విచారించిన కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసులు, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.