రాష్ట్రానికి 20లక్షల సోలార్ కనెక్షన్‌లు
ABN , Publish Date - Apr 14 , 2026 | 02:47 AM
పీఎం సూర్యఘర్ పథకంలో మన రాష్ట్రానికి 20లక్షల కనె క్షన్‌లు మంజూరయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. మండలంలోని మల్లంపేట గ్రామ ఎస్సీ కాలనీలో 44 గృహాలకు మంజూరైన ఉచిత సోలార్ యూనిట్లను సోమవారం ఆయన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి ప్రారంభించారు.
పీఎం సూర్యఘర్ పథకం కింద మంజూరు
విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్
దొనకొండ, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : పీఎం సూర్యఘర్ పథకంలో మన రాష్ట్రానికి 20లక్షల కనె క్షన్‌లు మంజూరయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. మండలంలోని మల్లంపేట గ్రామ ఎస్సీ కాలనీలో 44 గృహాలకు మంజూరైన ఉచిత సోలార్ యూనిట్లను సోమవారం ఆయన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి ప్రారంభించారు. గృహాలపై ఏర్పాటు చేసిన రూఫ్‌టాప్ ప్యానల్స్ వద్దకు వెళ్లి వాటి పనితీరును పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ సోలార్‌ను సద్వినియోగం చేసుకుంటే రాబోయే రోజుల్లో మన ఇంటిపైన మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 200 యూనిట్ల కరెంట్ వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు ఆరు లక్షల సోలార్ కనెక్షన్లు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అందులో దర్శి నియోజకవర్గానికి రూ.50.39 కోట్లతో 4,039 మంజూరయ్యాయన్నారు. మల్లంపేటలో 44 గృహాలపై ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీసీ, ఓసీలకు సబ్సిడీ అవకాశం ఉందన్నారు. రోజురోజుకు కరెంట్ వినియోగం, ఖర్చులు, చార్జీలు పెరుగుతున్నాయన్నారు. వీటిని తగ్గించేందుకు సమాజంలో వచ్చే కొత్తకొత్త మార్పులను అందిపుచ్చుకునేలా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి కార్యక్రమాలు చేపడుతున్న ప్రజాప్రభుత్వాన్ని ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ పేదలకు మేలు చేయాలని తలంచి పనిచేసేది ప్రజా ప్రభుత్వమన్నారు. రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసిమెలిసి పనిచేసి టీడీపీని గెలిపించాలని కోరారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వం తొమ్మిదిసార్లు కరెంట్ చార్జీలను పెంచి ప్రజలకు ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన సోలార్‌తో ఆర్థికంగా ఎంతో ఆదా అవుతుందన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్‌సాగర్, దర్శి మునిసిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మల్లంపేట మాజీ సర్పంచ్ వల్లపునేని వెంకటస్వామి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు వడ్లమూడి చెన్నయ్య, వైస్ ఎంపీపీ వడ్లమూడి వెంకటేశ్వర్లు, టీడీపీ మండల అధ్యక్షుడు మోడి ఆంజనేయులు, మాజీ అధ్యక్షుడు ఎన్.శివకోటేశ్వరరావు, మోడి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు పులిమి రమణాయాదవ్, దర్శి ఏఎంసీ డైరెక్టర్లు ఎస్.నాగసుబ్బారెడ్డి, కుందుర్తి లక్ష్మణ్, పార్టీ మండల కార్యదర్శి పి.సత్యానందం, టీడీపీ నాయకులు వీరపనేని వెంకన్నచౌదరి, కామేపల్లి చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.