మార్కాపురం కలెక్టరేట్ భవనం కోసం 20 ఎకరాలు
ABN , Publish Date - Sep 04 , 2026 | 02:36 AM
మార్కాపురంలో నూతన కలెక్టరేట్ భవనం, ఇతర జిల్లా కార్యాలయాల నిర్మాణం కోసం 20 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గోగులదిన్నె ఇలాకాలోని సర్వే నెంబర్ 90లో ఉన్న ఈ భూమిని రెవెన్యూశాఖకు బదిలీ చేసేందుకు గురువారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం
మార్కాపురం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురంలో నూతన కలెక్టరేట్ భవనం, ఇతర జిల్లా కార్యాలయాల నిర్మాణం కోసం 20 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గోగులదిన్నె ఇలాకాలోని సర్వే నెంబర్ 90లో ఉన్న ఈ భూమిని రెవెన్యూశాఖకు బదిలీ చేసేందుకు గురువారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-2లో చిక్కుకున్న టీబీఎంను తొలగించే పనులు, టన్నెల్‌లో 18.787 కి.మీ మేర చేపడుతున్న మెస్సర్స్ పనులను మెఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్ కంపెనీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అందుకు రూ.11.63 కోట్లు వెచ్చించేందుకు అనుమతి ఇచ్చింది.