Share News

లోక్‌ అదాలత్‌లో 18,700 కేసులు పరిష్కారం

ABN , Publish Date - Sep 13 , 2026 | 02:57 AM

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 18,700 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎ.సత్యానంద్‌ తెలిపారు. 29 బెంచ్‌లను ఏర్పాటు చేసి 18,380 క్రిమినల్‌, 238 సివిల్‌, మూడు ప్రీలిటిగేషన్‌ కేసులను పరిష్కరించామన్నారు.

లోక్‌ అదాలత్‌లో 18,700 కేసులు పరిష్కారం
ఒంగోలులోని జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌అదాలత్‌లో పాల్గొన్న అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రామకృష్ణ

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 29 బె ంచ్‌ల ఏర్పాటు

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 12 (ఆంధ్ర జ్యోతి) : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 18,700 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎ.సత్యానంద్‌ తెలిపారు. 29 బెంచ్‌లను ఏర్పాటు చేసి 18,380 క్రిమినల్‌, 238 సివిల్‌, మూడు ప్రీలిటిగేషన్‌ కేసులను పరిష్కరించామన్నారు. వీటికి సంబంధించి కక్షిదారులకు వివిధ పరిహారాలు, అవార్డుల రూపంలో మొత్తం రూ.4.50 కోట్ల మేర పరిహారం అందజేసినట్లు చెప్పారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను సత్వరం, స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించినట్లు తెలిపారు. ఇరుపక్షాల సమ్మతితో వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. లోక్‌ అదాలత్‌ విజయవంతం కావడానికి కృషిచేసిన న్యాయాధికారులు, న్యాయవాదులు, ఇన్సూరెన్స్‌ సంస్థల ప్రతినిధులు, బ్యాంకు, ఇతర శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమ కేసులను స్నేహపూర్వకంగా పరిష్కరించుకునేందుకు న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Sep 13 , 2026 | 02:57 AM