నాయకులు కీలకంగా వ్యవహరించాలి
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:43 PM
స్పెషల్ ఇంటెన్సివ్ రీజియన్ (సర్)లో పార్టీ నాయకులు చాలా కీలకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు.
సర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల
మార్కాపురం రూరల్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : స్పెషల్ ఇంటెన్సివ్ రీజియన్ (సర్)లో పార్టీ నాయకులు చాలా కీలకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు. స్థానిక మార్కెట్ యార్డులో పట్టణంలోని క్లస్టర్ 2, 4 లలో కొత్తగా నియమించిన ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జిలు, బీఎల్‌ఏలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డులలో గ్రామాల్లో హౌస్ మ్యాపింగ్ ప్రక్రియ ఓటర్ వెరిఫికేషన్ ఎలా చేయాలో వివరించారు. ఓటర్ లిస్టు దగ్గర ఉంచుకుని ప్రతి ఓటర్ వివరాలను సరిచూసుకోవాలని తెలిపారు. అభ్యర్థలను ఉంటే వెంటనే సంబంధిత అధికారికి తెలియజేసి సరిచేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంటక సుబ్బారెడ్డి, తాళ్లపల్లి సత్యనారాయణ, కనిగిరి బాల వెంకటరమణ, నాలి కొండయ్య యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
సర్‌పై శిక్షణ
ఎర్రగొండపాలెం రూరల్ : మండలంలోని బీఎల్‌వోలకు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సర్‌పై శిక్షణ ఇ చ్చారు. ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ విజయభాస్కర్‌రెడ్డి, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ పీ శివప్రసాద్, మాస్టర్ ట్రైనర్ బీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తరగతులు ని ర్వహించారు. కార్యక్రమంలో లక్ష్మనాయక్, బ్రహ్మయ్య, చిన్న వెంకటసుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు.