ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:23 AM
కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పడుతోంది. తెలంగాణలో వర్షాలు ఆగడంతో వాగులు, వంకల నుంచి వస్తున్న నీరు తగ్గుతోంది. బ్యారేజీ వద్దకు శనివారం 33,933 క్యూసెక్కుల వరద వస్తుండగా..
విజయవాడ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పడుతోంది. తెలంగాణలో వర్షాలు ఆగడంతో వాగులు, వంకల నుంచి వస్తున్న నీరు తగ్గుతోంది. బ్యారేజీ వద్దకు శనివారం 33,933 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 40 గేట్లను అడుగు మేర ఎత్తి 29 వేల క్యూసెక్కుల నీటిని దిగువన సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
వరదలోనే గండిపోశమ్మకు నైవేద్యం
గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దేవీపట్నం మండలం గొందూరులోని శ్రీగండిపోశమ్మ అమ్మవారి ఆలయాన్నీ చుట్టుముట్టింది. అమ్మవారి ఆలయం పూర్తిగా నీటమునిగి గోపురం మాత్రమే కనిపిస్తోంది. ఇంత వరదలోనూ ఆలయ పూజారి శనివారం బోటులో వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టారు.
- దేవీపట్నం, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు