Share News

మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం

ABN , Publish Date - Oct 05 , 2026 | 06:06 AM

మానసిక దివ్యాంగురాలిపై కన్నేసిన ఓ వ్యక్తి తాను స్వీపర్‌గా పనిచేస్తున్న చర్చిలోనే అమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

మానసిక  దివ్యాంగురాలిపై అత్యాచారం
image

నెల్లూరులోని ఓ చర్చిలో దారుణం

నెల్లూరు(క్రైం), అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): మానసిక దివ్యాంగురాలిపై కన్నేసిన ఓ వ్యక్తి తాను స్వీపర్‌గా పనిచేస్తున్న చర్చిలోనే అమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నెల్లూరు నగరంలోని ఓ చర్చిలో పనిచేస్తున్న మహిళకు మానసిక దివ్యాంగురాలైన కుమార్తె(13) ఉంది. తల్లితోపాటు చర్చిలోనే ఉంటోంది. అదే చర్చిలో జాషువా అనే వ్యక్తి స్వీపర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం చర్చి పై అంతస్తులో తల్లి శుభ్రం చేస్తుండగా, బాలికను గదిలోకి తీసుకెళ్లి జాషువా లైంగిక దాడికి పాల్పడ్డాడు. గుర్తించిన బాధితురాలి తల్లి కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. నిందితుడు పరారవుతూ గోడ దూకేందుకు యత్నించి గాయాలపాలు అయ్యాడు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - Oct 05 , 2026 | 06:14 AM