Share News

బీసీల ద్రోహి జగన్‌: బుద్దా వెంకన్న

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:25 AM

బీసీల ద్రోహి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అని, ఆయన చేసిన అన్యాయాలన్నీ రాష్ట్రం మొత్తం తిరిగి చెప్తామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ప్రకటించారు.

బీసీల ద్రోహి జగన్‌: బుద్దా వెంకన్న

విజయవాడ అర్బన్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): బీసీల ద్రోహి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అని, ఆయన చేసిన అన్యాయాలన్నీ రాష్ట్రం మొత్తం తిరిగి చెప్తామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ప్రకటించారు. మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేస్తామని జగన్‌ ఇచ్చిన మాట తప్పాడన్నారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్‌ ఇచ్చేందుకు కూటమి పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, ఓటమి భయంతో జగన్‌ ఈ ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నాడని, పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నాడని మండిపడ్డారు. జగన్‌ పార్టీ ఫ్యాన్‌ గుర్తు తీసేసి గొడ్డలి గుర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 05:25 AM