Share News

తాకట్టుకు వచ్చి దోపిడీ, హత్య

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:43 AM

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సంచలనం రేకెత్తించిన వడ్డీ వ్యాపారి గ్రంధి బాబి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 8 కిలోల వెండి,...

తాకట్టుకు వచ్చి దోపిడీ, హత్య

  • మొగల్తూరు వడ్డీ వ్యాపారి హత్య కేసులో వీడిన మిస్టరీ

నరసాపురం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సంచలనం రేకెత్తించిన వడ్డీ వ్యాపారి గ్రంధి బాబి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 8 కిలోల వెండి, 20వేల నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు కార్పొరేట్‌ సంస్థల్లో వారు తాకట్టు పెట్టిన 450 గ్రాముల బంగారాన్ని త్వరలో రికవరీ చేస్తామని డీఎస్పీ సుధాకర్‌ వెల్లడించారు. కేసుకు సంబంధించి ఆయన నరసాపురంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. మొగల్తూరులో ఒంటరిగా నివాసం ఉంటున్న గ్రంధి బాబి కొంతకాలంగా బంగారం, వెండి వస్తువులు కుదువ పెట్టుకుని అప్పులు ఇచ్చే వ్యాపారం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన మామిడిశెట్టి కల్యాణ్‌కుమార్‌ తరచూ ఆయన వద్దకు వస్తూ చిన్నచిన్న వస్తువులు కుదువ పెడుతుండేవాడు. బాబి ఒంటరిగా ఉంటున్న విషయాన్ని పసిగట్టిన కల్యాణ్‌కుమార్‌.. భీమవరానికి చెందిన గ్రామానికి చెందిన మేకా లక్ష్మీవరప్రసాద్‌, నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన చింతలపూడి సంతోశ్‌, మొగల్తూరుకు దొంగ సాయి అనే మరో ముగ్గురితో కలిసి దోపిడీకి పథకం పన్నాడు.


ఈ క్రమంలోనే జూన్‌లో బాబిని దారుణంగా హతమార్చి, ఇంట్లోని నగదు, ఆభరణాలు దోచుకెళ్లారు. అదే నెల 16న బాబి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన కుమారుడు పవన్‌కు సమాచారం ఇచ్చారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో, వయోభారంతో సహజంగానే మృతి చెంది ఉంటారని అంతా భావించారు. తండ్రి మరణంతో కుదువ పెట్టిన వారికి పవన్‌ సొంత నగదు ఇచ్చి రాజీ చేశారు. ఇటీవల పేరుపాలెం బీచ్‌లో మద్యం మత్తులో ఓ వ్యక్తి, బాబిది సహజ మరణం కాదని, హత్య అని పవన్‌కు చెప్పడంతో ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 05:43 AM