ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు టోకరా
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:50 AM
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో తమది కాని భూమిని అమ్మకానికి పెట్టిన ఓ ముఠా.. ఎమ్మెల్సీ రామచంద్రయ్యను బురిడీ కొట్టించి రూ.కోట్లు కొల్లగొట్టాలని పథకం వేసింది. పోలీసుల కథనం ప్రకారం..
మాదాపూర్‌లో భూమి అమ్మకానికి పెట్టి కాజేసిన ముఠా
హైదరాబాద్, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో తమది కాని భూమిని అమ్మకానికి పెట్టిన ఓ ముఠా.. ఎమ్మెల్సీ రామచంద్రయ్యను బురిడీ కొట్టించి రూ.కోట్లు కొల్లగొట్టాలని పథకం వేసింది. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులోని 5.5 ఎకరాల్లోని స్థలాన్ని రామచంద్రయ్యకు విక్రయించేందుకు పేరూరి తులసీగోపాల్ అతని కుమారుడు గిరిధర్ బేరం పెట్టారు. రామచంద్రయ్య టోకెన్ అడ్వాన్సుగా రూ.25 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించారు. ఆపై భూమి దస్తావేజులు చూపించాలని కోరగా.. వారు తప్పించుకు తిరుగుతున్నారు. అనుమానం వచ్చి ఆరా తీయగా.. ఆ స్థలం వారిది కాదని తేలింది. దీంతో రామచంద్రయ్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు