Share News

సెలైన్‌ ఎక్కించుకుని మరీ..!

ABN , Publish Date - Nov 23 , 2026 | 06:26 AM

కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో సెలైన్‌ ఎక్కించుకుని మరీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

సెలైన్‌ ఎక్కించుకుని మరీ..!
tdp

  • జ్వరంతోనే పాలకొల్లులో మంత్రి నిమ్మల ఎన్నికల ప్రచారం

పాలకొల్లు అర్బన్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో సెలైన్‌ ఎక్కించుకుని మరీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో 18, 3, 30, 31, 26, 27వ వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. చైర్మన్‌ అభ్యర్థి ఉషారాణి, కూటమి పార్టీల తరఫున పోటీలో ఉన్న కౌన్సిలర్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు.

Updated Date - Nov 23 , 2026 | 06:36 AM