Share News

మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో మత్స్యకార కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ABN , Publish Date - Feb 22 , 2026 | 04:41 AM

మత్స్యకార కుటుంబాలకు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న గ్రూప్‌ యాక్సిడెంట్‌ ఇన్యూరెన్స్‌ స్కీమ్‌ సొమ్ము విడుదలకు మంత్రి అచ్చెన్నాయుడు చొరవ చూపారు.

మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో మత్స్యకార కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ఇంటర్నెట్ డెస్క్: మత్స్యకార కుటుంబాలకు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న గ్రూప్‌ యాక్సిడెంట్‌ ఇన్యూరెన్స్‌ స్కీమ్‌ సొమ్ము విడుదలకు మంత్రి అచ్చెన్నాయుడు చొరవ చూపారు. వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ.4.75కోట్లు విడుదల చేసినట్లు మత్స్యశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 2018 నుంచి వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న క్లైములను మంత్రి అచ్చెన్న ఆదేశాలతో పరిష్కరించినట్లు వెల్లడించింది. 90 మంది కుటుంబాల బ్యాంకుఖాతాల్లో నేరుగా ఎక్స్‌గ్రేషియా సొమ్మును జమ చేసినట్లు పేర్కొంది. సాంకేతిక సమస్యని పరిష్కరించి, మిగిలిన ఐదుగురికి ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తెలిపింది.

Updated Date - Feb 22 , 2026 | 04:42 AM