మహాపాపం గత పాలకులదే
ABN , Publish Date - Feb 07 , 2026 | 05:14 AM
తిరుమల శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం వెను క గత పాలకుల పాపాలు దాగి ఉన్నాయని, వీటి నుంచి ఎవరూ తప్పించుకోలేరని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు
టెక్కలి/అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం వెను క గత పాలకుల పాపాలు దాగి ఉన్నాయని, వీటి నుంచి ఎవరూ తప్పించుకోలేరని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి, అమరా వతిలో ఆయన మాట్లాడారు. ‘‘వైసీపీ పాలన లో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. అప్పటి టీటీడీ చైర్మన్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి సోయిలేకుండానే సంతకాలు చేశారా?. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి కల్తీకి మా ర్గం చూపారు. ఆ రోజు లోతైన విచారణ లేకుండానే కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని ప్రశ్నించార. చుక్క పాలు లేకుండా మొత్తం రసాయనాలతో నెయ్యి తయారు చేసే కంపెనీలు వైసీపీ దృష్టిలో స్టార్టప్ కంపెనీలా?. నెయ్యిలో పాలు, వెన్నకు బదులు మోనోగ్లిజరైడ్ బీటీ కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ వంటి రసాయన పదార్థాలు ఉపయోగించి మహాపాపానికి ఒడిగట్టారు. నిజ నిర్ధారణ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు.’’ అని మంత్రి హెచ్చరించారు.