Share News

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:08 AM

‘మురసు’ నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో సిద్ధంగా ఉన్నాయని హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి అనిత చెప్పారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

  • ‘మురసు’ ముందస్తు చర్యలపై హోం మంత్రి అనిత సమీక్ష

అమరావతి/పాయకరావుపేట, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘మురసు’ నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో సిద్ధంగా ఉన్నాయని హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి అనిత చెప్పారు. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి తుఫాన్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఆమె టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రమాదం జరిగే అవకాశం ఉంటే ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. అత్యవసర సహాయం అవసరమైనవారు మనమిత్ర వాట్సాప్‌ నంబర్‌ (95523 00009)తో పాటు విపత్తుల నిర్వహణ సంస్థకు చెందిన 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని మంత్రి అనిత సూచించారు.

14 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

విజయవాడ, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు సంసిద్ధత, సహాయక చర్యల కోసం 14 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపినట్లు 10వ బెటాలియన్‌ కమాండెంట్‌ వీవీఎన్‌ ప్రసన్నకుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Nov 03 , 2026 | 07:08 AM