కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఆత్మకూరు అభివృద్ధే లక్ష్యం: మంత్రి ఆనం
ABN , Publish Date - Sep 25 , 2026 | 07:58 PM
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి నాయకులతో మంత్రి ఆనం సమావేశం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..
నెల్లూరు, సెప్టెంబర్ 25: జిల్లాలోని ఆత్మకూరు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి నాయకులతో మంత్రి ఆనం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూటమి నాయకులతో చర్చించి సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. గతంలో ఆత్మకూరు మున్సిపాలిటీలో 23 వార్డులు ఉండగా.. ప్రస్తుతం 28 వార్డులకు పెంచామని.. గత రెండేళ్లలో మున్సిపాలిటీలో భారీగా అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆత్మకూరులో చేసిన అభివృద్ధిని ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తోందని.. తమ ప్రభుత్వ హయాంలో వివిధ హోదాల్లో కొనసాగుతున్న వైసీపీ నాయకుల పేర్లను సైతం శిలాఫలకాలపై ఉంచామని మంత్రి తెలిపారు.
ఆత్మకూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కూటమి నాయకులకు సూచించారు. డీఎస్సీ అంశంపై వైకాపా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించిన మంత్రి.. వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి నాయకులతో మంత్రి ఆనం సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు పూర్తి చేశామని.. ఆత్మకూరు మున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.