Share News

విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తొలగించాలి

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:25 AM

విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తొలగించేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...

విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తొలగించాలి

  • అవగాహన కార్యక్రమాలు చేపట్టండి

  • విద్యాశాఖపై సమీక్షలో మంత్రి లోకేశ్‌

అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తొలగించేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన, ఇన్‌స్టిట్యూషనల్‌ సపోర్ట్‌ సిస్టమ్‌, గైడెన్స్‌ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. దీనిపై సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు స్పందిస్తూ... విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం కోసం కేర్‌ ఏపీ టూల్‌ను ప్రారంభించామని చెప్పారు. 935 పాఠశాలల్లోని 4.47లక్షల మంది విద్యార్థులకు యోగా శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో ముఖఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయాలన్నారు. వచ్చే ఏడాది చివరికి రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధించాలన్నారు. పీఎంసేతు పథకం ద్వారా పారిశ్రామికవేత్తల సహకారంతో 10 పారిశ్రామిక అనుసంధానిత ఐటీఐ క్లస్టర్లను అభివృద్ధి చేయాలన్నారు. ఇందుకోసం స్టీల్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ, ఆక్వా, ఫార్మా సంస్థలను సంప్రదించి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు జె.శ్యామలరావు, భరత్‌గుప్తా, రంజిత్‌ బాషా, తమీమ్‌ అన్సారియా, దీవెన్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు.

వ్యక్తిగత పర్యటనపై నేడు విదేశాలకు సీఎం

సీఎం చంద్రబాబు వ్యక్తిగత పర్యటనపై గురువారం రాత్రి విదేశాలకు వెళుతున్నారు. 4 రోజుల అనంతరం 29న తిరిగి అమరావతి చేరుకుంటారు.

ఢిల్లీ వెళ్లిన మంత్రి లోకేశ్‌

మంత్రి లోకేశ్‌ బుధవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గురువారం ఆయన ఢిల్లీలో జరిగే పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ‘ఫైర్‌ సైడ్‌ చాట్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు. గురువారం రాత్రికి ఢిల్లీ నుంచి బయలుదేరి అహ్మదాబాద్‌ చేరుకుంటారు. శుక్రవారం అక్కడ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ 2026లో పాల్గొంటారు.

Updated Date - Sep 24 , 2026 | 06:25 AM