Share News

చర్చకొస్తారా? బర్నాల్‌ పంపమంటారా?

ABN , Publish Date - Nov 23 , 2026 | 06:50 AM

ఏపీలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, అభివృద్థి అంశాలపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసిరారు

చర్చకొస్తారా? బర్నాల్‌ పంపమంటారా?
burnol

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై చర్చకు రావాలని జగన్‌కు మంత్రి లోకేశ్‌ సవాల్‌

‘ఇది మా ట్రాక్‌ రికార్డు’ అంటూ వివిధ కంపెనీలపెట్టుబడుల వివరాలతో ‘ఎక్స్‌’లో పోస్టు

అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, అభివృద్థి అంశాలపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసిరారు. ప్రస్తుత కూటమి, గత వైసీపీ ప్రభుత్వాల పనితీరును పోలుస్తూ ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 2024లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గూగుల్‌ (రూ. 1,33,000 కోట్లు), ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ (రూ.1,36,000 కోట్లు), బ్రూక్‌ఫీల్డ్‌ (రూ.1,06,000 కోట్లు), రిలయన్స్‌ (రూ.43,000 కోట్లు), రెన్యూ తదితర ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులతో ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. ‘కూటమి ప్రభుత్వ పెట్టుబడుల ట్రాక్‌ రికార్డు 2024-26’ పేరుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ కంపెనీల పెట్టుబడుల వివరాలను పేర్కొంటూ ఓ గ్రాఫిక్‌ చిత్రాన్ని పోస్టు చేశారు. దీనికి భిన్నంగా వైసీపీ హయాంలో ఎలాంటి పెట్టుబడులు రాలేదని ఎండగడుతూ.. ఏపీ ఖాళీగా ఉన్న మ్యాప్‌, దాని పక్కన బర్నాల్‌ అయింట్‌మెంట్‌ ట్యూబ్‌ ఉన్న చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. ‘ఇదే మా ట్రాక్‌ రికార్డ్‌ జగన్‌! వివిధ రంగాలకు చెందిన అగ్రశ్రేణి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి.

burnol1 copy.jpgతద్వారా ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగాలు లభించాయి’ అని లోకేశ్‌ తెలిపారు. యువతకు ఉద్యోగాలు తెచ్చేందుకు తాము పనిచేస్తుంటే.. పెట్టుబడులు, ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారన్నారు. ‘ఇక చాలు.. పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై చర్చకు నేను సిద్థం. మీరు చర్చకు వస్తారా, లేక బర్నాల్‌ పంపించమంటారా?’ అంటూ ‘క్రెడిట్‌ చోర్‌ జగన్‌’ హ్యాష్‌ట్యాగ్‌ను పోస్టు చేశారు.

Updated Date - Nov 23 , 2026 | 07:14 AM