మద్యం స్కాం కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వండి
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:40 AM
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ కీలక నిందితుడు వాసుదేవరెడ్డి ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈడీ కోర్టులో వాసుదేవరెడ్డి పిటిషన్.. విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ కీలక నిందితుడు వాసుదేవరెడ్డి ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన నాయనమ్మ చనిపోయారని, వారం రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఈడీ అధికారులను ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. మద్యం స్కాంలో రవాణా కుంభకోణం ఆరోపణలపై ఇటీవలే కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి, అప్పటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిలను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వీరిద్దరినీ తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.