‘లేపాక్షి’తోనే హస్తకళలకు ఊపిరి
ABN , Publish Date - Sep 27 , 2026 | 04:20 AM
రాష్ట్రంలోని హస్తకళల వారసత్వాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.
కళాకారులకు శిక్షణ, మార్కెటింగ్: చైర్మన్ హరిప్రసాద్
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని హస్తకళల వారసత్వాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. అక్టోబరు నుంచి గురు శిష్య హస్త శిల్ప శిక్షణ, డిజైన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ వర్క్‌షాప్, మెరుగైన పనిముట్ల పంపిణీ జరుగుతుందని వివరించారు. రాజమహేంద్రవరం, విజయవాడ, విష్ణువాసం, కాకినాడ, గుంటూరులోని లేపాక్షి కేంద్రాల్లో డిజైన్ అండ్ టెక్నాలజీ వర్క్‌షాపుల ద్వారా కళాకారులకు శిక్షణ ఇస్తామన్నారు. అక్టోబరు 9 నుంచి 18 వరకూ విజయవాడలో గాంధీ శిల్పబజార్ నిర్వహించి కళాకారుల ఉత్పత్తుల విక్రయానికి ప్రోత్సాహం కల్పిస్తామని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు