Share News

ఓటమి భయంతోనే వైసీపీ అల్లర్లు

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:27 AM

ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టిస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల మంత్రి టీజీ భరత్‌ మండి పడ్డారు.

ఓటమి భయంతోనే వైసీపీ అల్లర్లు

మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టిస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల మంత్రి టీజీ భరత్‌ మండి పడ్డారు. నగరంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పుంగనూరు, రాయచోటి, తిరుపతి ప్రాంతాల్లో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడులు చేయడం దారుణమన్నారు. నామినేషన్ల సమయంలో వైసీపీ నాయకులు రౌడీయిజం చేస్తూ ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు నామినేషన్ల సమయంలలో టీడీపీ కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం అధికారంలో లేకపోయినా వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదని అన్నారు. వైసీపీ నాయకుల వ్యవహార శైలిపై ఎన్నికల సంఘం సీరియ్‌సగా స్పందించాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పట్టిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు వైసీపీ నాయకుల వ్యవహార శైలిని గమనించాలని, తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Updated Date - Oct 17 , 2026 | 12:27 AM