రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:46 PM
గత వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిం దని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిం దని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ రైతులకు ద్రోహం చేసిందే వైసీపీ ప్రభుత్వమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను వైసీపీ నాయకులు పట్టించుకోలేదన్నారు. నేడు అధికారం కోల్పోయిన వైసీపీ రాజకీయ నిరుద్యోగులు రాయల సీమపై మాట్లాడుతూ సీమ రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. ప్రజలు వైసీపీ నాయకులను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అసెంబ్లీలో లడ్డూ కల్తీపై చర్చిద్దామని సవాల్ విసిరినా సభకు హాజరుకాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు తప్పిం చుకొని పారిపోతు న్నారని విమర్శించారు. దద్దనాల ప్రాజెక్టు గేట్లను తుప్పుపట్టేలా చేశార న్నారు. సొంత నిధులు రూ.27లక్షలు ఖర్చుపెట్టి మోటార్లు మరమ్మతులు చేసి దద్దనాలకు పంపింగ్ చేసిన ఘనత తనదన్నారు. వైసీపీకి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు.