వైఎస్ జగన్ ఓ భూబకాసురుడు
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:39 PM
గత వైసీపీ పాలనలో జగన్ ఓ భూబకాసురుడులా వ్యవహరించాడని రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ధ్వజమెత్తారు.
వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం
న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, జనవరి24(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో జగన్ ఓ భూబకాసురుడులా వ్యవహరించాడని రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ధ్వజమెత్తారు. శనివారం మండలంలోని కానాల, హైస్కూల్ కొట్టాల గ్రామాల్లో కలెక్టర్ రాజాకు మారితో కలిసి ‘స్వచ్ఛాంధ-స్వర్ణాంధ్ర’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛరథాలతో పాటు గోకులం షెడ్లు ప్రారం భించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1961లో దాతలు విద్యా వ్యవస్థ బలోపేతానికి సూమారుగా రూ.50కోట్లు విలువ చేసే 12.5ఎకరాల స్థలాన్ని పాఠశాలకు విరాళంగా ఇచ్చి నిర్మించారన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థలంపై కన్నేసిన జగన్ అనుచరులు ఆక్రమణకు సన్నద్ధమ య్యారన్నారు. ఎయిడెడ్ పాఠశాలల విలీనం చేసే దుర్మార్గపు చర్యల్లో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తంచేశారు. పాఠశాల స్థలాన్ని గుర్తి ంచాలని డీఈవోని ఆదేశించారు. అక్రమణకు పాల్పడిన ఎంతటి వారినైనా ఊపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్కె ట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మండల కన్వీనర్ విశ్వనాథ్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీవాణి, ఎంపీడీవో సుగుణశ్రీ, టీడీపీ నాయకులు శివారెడ్డి, బాబు, హనీఫ్, రవిబాబు పాల్గొన్నారు.