Share News

‘సీమ’ ద్రోహి వైఎస్‌ జగన్‌

ABN , Publish Date - May 22 , 2026 | 12:12 AM

రాయలసీమకు తీరని అన్యాయం చేసిన సీమ ద్రోహి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గురువారం సాయంత్రం జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ, ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, గౌరుచరితారెడ్డి, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు

‘సీమ’ ద్రోహి వైఎస్‌ జగన్‌
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి

11 సీట్లు ఇచ్చి ఇంటి కి పంపినా సిగ్గు రాలేదు..

24 నెలల్లో వంద శాతం అభివృద్ధి

గనులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర

కర్నూలు అర్బన్‌, మే 21(ఆంధ్రజ్యోతి): రాయలసీమకు తీరని అన్యాయం చేసిన సీమ ద్రోహి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గురువారం సాయంత్రం జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ, ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, గౌరుచరితారెడ్డి, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 24 నెలల్లో వంద శాతం అభివృద్ధి, సంక్షేమం అమలు చేసిందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలనుఅమలు చేసి ప్రజల మన్ననలు పొందిందన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డికి ప్రజలు 11సీట్లు ఇచ్చి ఇంటికి పంపినా సిగ్గు రాకపోగ అహంకార పూరితదోరణితో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు నాయ కత్వంలో ఓర్వకల్లును పారిశ్రామిక కారిడారుగా ప్రకటించి ఎన్నో పరిశ్రమల స్థాపనకు కృషి చేశారన్నారు. కురువ, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ల చైర్మన్‌, చైర్‌ పర్సన్‌ దేవేం ద్రప్ప, పార్వతమ్మ, జిల్లా గ్రంథాలయం చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, మంత్రాలయం ఇన్‌చార్జి రాఘవేంద్రరె డ్డి, మాజీ ఎంపీ సంజీ వకుమార్‌, ఽనంద్యాల నాగేంద్ర పాల్గొన్నారు

Updated Date - May 22 , 2026 | 12:12 AM