‘మత్తు’కు యువత దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:20 PM
: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు.
కర్నూలు క్రైం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్ మైదానంలో ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన పోస్టర్లను ఏఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ ఏఎస్పీ కృష్ణమోహన్‌లతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం, యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ అలవాటు వ్యక్తి కుటుంబం, సమాజ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ఏఎస్పీ హుసేన్‌పీరా, ఏఆర్ ఏఎస్పీ కృష్ణమోహన్‌లు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుష్ప్రభా వాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అవసరమన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్ టోల్ ప్రీ నెంబర్.1972కు తెలియజేయాలని సూచించారు. అలాగే ఎన్‌డీపీఎస్ చట్టం-1985పై పోలీసు సిబ్బందికి అవగా హన కల్పించి ఈగల్ విభాగం చేపడుతున్న వివిద అవగాహన నిరోధక చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు డీఎస్పీ ప్రసాద్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పోలీసు సిబ్బంది, హోంగార్డులు, ఈగల్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ ఎలిషా, ఈగల్ టీమ్ కానిస్టేబుల్ రమేష్ పాల్గొన్నారు.