Share News

మీ ఇంటికి మీ డాక్టర్‌...

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:41 PM

గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి ప్రాఽథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మీ ఇంటికి మీ డాక్టర్‌ ప్రాజెక్టులో భాగంగా మొబైల్‌ మెడికల్‌ యూని ట్‌ను కలెక్టర్‌ రాజకుమారి సోమవారం ప్రారంభించారు.

మీ ఇంటికి మీ డాక్టర్‌...
జెండా ఊపి మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌

మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ను ప్రారంభించిన కలెక్టర్‌

నంద్యాల నూనెపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి ప్రాఽథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మీ ఇంటికి మీ డాక్టర్‌ ప్రాజెక్టులో భాగంగా మొబైల్‌ మెడికల్‌ యూని ట్‌ను కలెక్టర్‌ రాజకుమారి సోమవారం ప్రారంభించారు. నంద్యాల కలెక్ట రేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ ఆవరణలో సుమారు రూ.1.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ ప్రారంభోత్సవంలో జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌, డీఆర్వో రామునాయక్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ దస్తగిరి పర్ల, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్‌రెడ్డి, కోశాధికారి నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు వారి ఇంటి వద్దనే నాణ్యమైన వైద్య సేవలందిం చాలనే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ మార్చి నుంచి మే వరకు జిల్లాలోని బండిఆత్మకూరు మండలంలోని 15 గ్రామాల్లో సేవలందించనుంద న్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా, రూరల్‌ ఎలక్ర్టిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధుల సహకారంతో అమలు చేస్తున్నట్లు తెలిపారు. రూ.8.40 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మూడేళ్లు కొనసాగుతుందన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 11:41 PM