ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ABN , Publish Date - Jun 14 , 2026 | 11:30 PM
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సాయుధ బలగాల అడిషనల్ ఎస్పీ చిన్నికృష్ణ సూచించారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో సైకిల్ ర్యాలీని ఆయన ఆదివారం ప్రారంభించారు.
అడిషనల్ ఎస్పీ చిన్నికృష్ణ
నంద్యాల క్రైమ్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సాయుధ బలగాల అడిషనల్ ఎస్పీ చిన్నికృష్ణ సూచించారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో సైకిల్ ర్యాలీని ఆయన ఆదివారం ప్రారంభించారు. నంద్యాల పోలీసుల ఆధ్వ ర్యంలో ప్రారంభించిన ర్యాలీ స్థానిక పద్మావతీనగర్ ఇండోర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ పద్మావతీనగర్ ఆర్చ్, శ్రీనివాససెంటర్, క ల్పనాసెంటర్, గాంధీచౌక్ మీదుగా తిరిగి ఇండోర్ స్టేడియం వరకు కొనసాగింది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఫిట్‌నెస్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గతవాకం 7న ప్రారంభమైన ర్యాలీ శుక్రవారం నాటికి రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఏఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవితానికి సైక్లింగ్ చాలా అవసరమని, తమతోపాటు పిల్లలకు కూడా సైక్లింగ్‌ను అలవాటుగా మార్చాలని పిలుపునిచ్చారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా వస్తున్న అనారోగ్య సమస్యలను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ శారీరక శ్రమను అలవాటు చేసుకోవాలన్నారు.