Share News

గడవులోపు రెన్యువల్‌ చేసుకోవాలి

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:33 PM

2026-27 సంవత్సరానికి గానూ మద్యం దుకాణాల రెన్యువల్‌ను గడువు లోపు పూర్తి చేసుకోవాలని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుధీర్‌బాబు అన్నారు.

గడవులోపు రెన్యువల్‌ చేసుకోవాలి
మాట్లాడుతున్న జిల్లా ఎక్సైజ్‌ అధికారి సుధీర్‌బాబు

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుధీర్‌బాబు

ఆదోని, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): 2026-27 సంవత్సరానికి గానూ మద్యం దుకాణాల రెన్యువల్‌ను గడువు లోపు పూర్తి చేసుకోవాలని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుధీర్‌బాబు అన్నారు. గురువారం ఆదోని ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌లో రెన్యువల్‌ ప్రక్రియపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఆదోని ఎక్సైజ్‌ సీఐ సైదుల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సుధీర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన రెన్యువల్‌కు సంబంధించిన నూతన ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను లైసెన్సీదారులకు వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. లైసెన్సీలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. సీఐ సైదుల్‌ మా ట్లాడుతూ నిర్ణీత సమయంలోనే మద్యం విక్రయాలు జరపాలని, బెల్ట్‌ షాపులను ప్రో త్సహించరాదన్నారు. కార్యక్రమంలో మద్యం దుకాణాల యజమానులు, ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 11:33 PM