Share News

ఆరోగ్యం, ప్రశాంతం యోగా సొంతం

ABN , Publish Date - Jun 08 , 2026 | 11:50 PM

నిరంతర యోగా సాధనతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతం సొంతమవుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ సిరి పిలుపునిచ్చారు.

ఆరోగ్యం, ప్రశాంతం యోగా సొంతం
యోగాలో పాల్గొన్న జిల్లా యంత్రాంగం, అధికారులు

21న యోగా డేను జయప్రదం చేయండి

కలెక్టర్‌ డాక్టర్‌ సిరి పిలుపు

ఓర్వకల్లు, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): నిరంతర యోగా సాధనతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతం సొంతమవుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ సిరి పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్లు రాక్‌ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన ‘పర్యాటక యోగ’ కార్యక్రమానికి వందలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ సరి ఆసనాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే జీవన విధానమని పేర్కొన్నారు. ప్రస్తుత జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడిని అధికమించేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం, అత్యంత ఉపయుక్తమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. యోగా కార్యక్రమాన్ని గ్రామస్థాయి వరకు విస్తరించేందుకు జిల్లాలో ఇప్పటికే 200 మంది మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ అందించామన్నారు.వారి ద్వారా గ్రామాలు, మండలాల్లో ప్రజలకు యోగా సాధనపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మున్సిపల్‌ హైస్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన అడ్వాన్స్‌డ్‌ యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ సిరి, జేసీ నూరుల్‌ ఖమర్‌, డీఆర్వో వెంకటనారాయణమ్మ, టూరిజం రీజనల్‌ డైరెక్టర్‌ ఓబులమ్మ, డీపీఆర్వో జయమ్మ, జడ్పీసీఈవో రమణారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 11:50 PM