అధిక సాంద్రత పద్ధతితో దిగుబడులు
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:53 PM
పత్తిని అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించొచ్చని గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు.
గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయ అధికారి వెంకటేశ్వర్లు
నందికొట్కూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పత్తిని అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించొచ్చని గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ కార్యాలయంలో ఏడీఏ గిరీష్ ఆధ్వర్యంలో అధిక సాంద్రత పద్ధతి సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సాధారణ పద్ధతి పత్తి సాగు కంటే అధిక సాంద్రతలో సాగు చేయడంతో 20-30 శాతం అధిక దిగుబడి వస్తుంద న్నారు. లోతు తక్కువ నల్లభూముల్లో దిగుబడి ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. సబ్సిడీపై వచ్చిన మందులను పత్తి రైతులకు అందజేశారు. శాస్త్రవేత్తలు డా.అశోక్‌కుమార్, డా.మల్లేశ్వర్‌రెడ్డి, డా.పులి బాయ్, ఏవో షేక్షావలి పాల్గొన్నారు.