Share News

సీమ ఎత్తిపోతలపై వైసీపీ దుష్ప్రచారం

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:10 PM

రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు అడ్డుకుంటున్నట్లు వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీమ ఎత్తిపోతలపై వైసీపీ దుష్ప్రచారం
పాదయాత్రగా వస్తున్న ఎమ్మెల్యేలు గౌరుచరిత, జయసూర్య

ధనార్జనే ధ్యేయంగా జగన్‌ హయంలో పనులు

వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు గౌరు చరిత, జయసూర్య

జూపాడుబంగ్లా, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు అడ్డుకుంటున్నట్లు వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జూపాడుబంగ్లా మండ లంలోని పోతిరెడ్డిపాడు సమీపంలో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పనులను టీడీపీ శ్రేణులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పనులను వైసీపీ ప్రభుత్వంలో డీపీఆర్‌, పర్యావరణ అనుమతులు లేకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనులను ఇష్టా నుసారంగా ప్రారంభిస్తే, అప్పుడే పర్యావరణ అనుమతులు లేవని పనులను ఆపేయాలని కోర్డు ఆదేశించిందని అన్నారు. మట్టిపనులు చేసి ధనార్జనే ధ్యేయంగా జగన్‌ రూ.1000 కోట్లు జేబులు నింపు కున్నారని ఆరోపించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ అలగనూరు రిజర్వాయర్‌ వైసీపీ హయంలో నిర్ల క్ష్యం చేశారని, రూ.3కోట్లతో మరమ్మతులు చేయకపోవడంతో రూ. 36 కోట్ల అంచనాకు వ్యయం పెరిగిపోయిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రూ.58 కోట్లు ఈ పనులకు మంజూరు చేశార న్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ మోహన్‌రెడ్డి, టీడీపీ సీనియర్‌ నాయకులు మాండ్ర శివానందరెడ్డి, గిరీశ్వరరెడ్డి, శ్రీని వాసులు, రమణారెడ్డి, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:10 PM